అరుంధతి దర్శనం

వివాహమైన వెంటనే నూతన వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించే ఆచారం ప్రాచీన కాలం నుంచి వస్తోంది. ఒకవేళ వివాహ సమయం రాత్రి గానీ ... తెల్లవారు జామున గాని కాకపోయినప్పటికీ ఆచారం ప్రకారం అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూనే వుంటారు.

అరుంధతి ... వశిష్ఠ మహర్షి భార్య ... మహా పతివ్రత. తన పాతివ్రత్య మహిమచే కాలగమనాన్ని సైతం ఆదేశించగల శక్తిమంతురాలామే. వారిది ఆదర్శవంతమైన ... అన్యోన్యమైన దాంపత్యం. అందువలన వారిని ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే కొత్త దంపతులకు అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తుంటారు.

ఈ విధంగా చేయడం వలన వారి ఆశీర్వచనాలు కూడా లభించి ఆ దాంపత్యం సుఖమయం అవుతుందని అందరూ భావిస్తుంటారు. ఇక రాత్రి వేళల్లో ... తెల్లవారు జామున కనిపించే అరుంధతి నక్షత్రం కోసం ఆకాశం వంక చూస్తారు కాబట్టి, ఆ నక్షత్రాల కాంతి కారణంగా దృష్టికి సంబంధించిన దోషాలు తొలగి కంటిచూపు బలపడుతుందని పెద్దలు చెబుతుంటారు. దాంపత్య జీవితానికి సంబంధించిన మార్గదర్శకత్వమే కాకుండా ఆరోగ్యపరమైన బలాన్ని ఇవ్వడమనేది మనకి ఈ ఆచారంలో కనిపిస్తుంది.


More Bhakti News