హనుమజ్జయంతి రోజున ఏంచేయాలి ?
బుద్ధిబలం ... బాహుబలం ... యోగబలం ... గ్రహబలం ... దైవబలం సొంతం చేసుకున్నవాడిగా హనుమంతుడు కనిపిస్తుంటాడు. శివాంశ సంభూతుడిగా చెప్పబడుతోన్న హనుమంతుడు, శ్రీమన్నారాయణుడి అవతారమైన రాముడిని తన హృదయంలో బంధించాడు. అందువల్లనే హనుమంతుడిని సేవిస్తే, శివకేశవులను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు.
ఇక హనుమంతుడు సూర్యభగవానుడి చెంత శాస్త్రవిజ్ఞానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, ఆయన కూతురు సువర్చలను వివాహం చేసుకున్నాడు. అందువలన గ్రహాలు ఆయనపై దుష్ప్రభావాలు చూపించలేవు. ఈ కారణంగానే గ్రహపీడితులు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ వుంటారు. అలాంటి హనుమంతుడి జయంతిని ఉత్తరాదికి చెందినవాళ్లు 'చైత్రపౌర్ణమి' రోజున నిర్వహిస్తూ వుండగా, 'వైశాఖ బహుళ దశమి' రోజున దక్షిణాదివాళ్లు జరుపుతుంటారు.
ఈ రోజున హనుమంతుడి ఆలయాలన్నీ కూడా భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటాయి. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని శుభ్రపరిచి హనుమంతుడి చిత్రపటాన్ని పూలమాలికలతో అలంకరించాలి. హనుమంతుడి వెండి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. స్వామివారిని అంకిత భావంతో సిందూరంతోను ... తమలపాకులతోను పూజించాలి.
హనుమంతుడికి వడలు అంటే ఎంతో ఇష్టం ... వడమాల తెచ్చినవారిపట్ల ఆయన మరింత వాత్సల్యాన్ని ప్రదర్శిస్తాడట. ఇక ఈ కాలంలో లభించే రుచికరమైన మామిడి పండ్లను ... బెల్లంతో తయారుచేసిన పొంగలిని ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత దగ్గరలో గల హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆయనకి ప్రదక్షిణలు చేయాలి.
స్వామివారి సన్నిధిలో కాసేపు కూర్చుని 'హనుమాన్ చాలీసా' చదువుకోవాలి ... సుందరకాండ పారాయణం చేసుకోవాలి. ఈ విధంగా హనుమంతుడి జయంతి రోజున ఆయనకి సంతోషాన్ని ... సంతృప్తిని కలిగించడం వలన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు కలుగుతాయి.