కరుణించే అమ్మవారు

శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు అనేక రూపాలలో ... వివిధ నామాలతో భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. అమ్మవారు అవతరించిన ప్రతిరూపానికి ఓ ప్రత్యేకత వుంటుంది ... ఓ పరమార్థం వుంటుంది. ఈ నేపథ్యంలో అమ్మవారు వాసవీ కన్యకగా కొలువుదీరిన క్షేత్రం మనకి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దర్శనమిస్తుంది.

కన్యకను ఇలవేల్పుగా భావించి పూజించే భక్త బృందం ఇక్కడ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సువిశాలమైన ప్రదేశంలో అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం, ఇక్కడి వారి భక్తిశ్రద్ధలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో అమ్మవారు పాలరాతిమూర్తిగా కళకళలాడుతూ కనిపిస్తూ వుంటుంది. ప్రతి శుక్రవారంతో పాటు విశేషమైన పుణ్య తిథుల్లో అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుతుంటారు.

అమ్మవారు జ్ఞానాన్ని .. సౌభాగ్యమనే సంపదను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక దసరా నవరాత్రుల సందర్భంలో అమ్మవారి వైభవం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజున అమ్మవారిని ఒక్కో రూపంగా అలంకరణ చేస్తుంటారు. కుమారీ పూజలు .. సువాసినీ పూజలు నిర్వహిస్తుంటారు. నగరేశ్వర .. కన్యకా వ్రతాలను ఘనంగా జరుపుతారు.

పర్వదినాల సమయంలో మహిళా భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారిని సంతోష పెట్టడానికి ... ఆ సంతోషంలో తాము పాలుపంచుకోవడానికి భజనలు ... కోలాటాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇతర పరివర దేవతలుగా పూజలు అందుకుంటూ వుంటారు.


More Bhakti News