Advertisement

దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లోని ఎంవోయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష

Revanth Reddy review on MOU
  • కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచన
  • ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సూచన
  • ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి
దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రెండు సదస్సుల్లో జరిగిన ఎంవోయూలపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ అంశాలు, ఫ్యూచర్ సిటీ, ఇతర ప్రాంతాల్లో సంస్థలకు కేటాయించాల్సిన భూమి వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని డేటా సెంటర్లు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి, ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆయా సంస్థలు రాష్ట్రంలో త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని అన్నారు.

Advertisement
Revanth Reddy review on MOU
TelanganaCM Revanth Reddy

More Telugu News