ఎయిరిండియా విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయాడు.. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం పొమ్మంటోంది!
- విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయిన భారతీయుడు
- యూకే నుంచి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న సేఠ్వాలా
- మానవతా దృక్పథంతో చేసిన అభ్యర్థనను తిరస్కరించిన హోం ఆఫీస్
- ఇండియాకు వెళ్లలేనని, ఇక్కడే జీవితం మొదలుపెడతానని ఆవేదన
ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో భార్య, కన్నబిడ్డను కోల్పోయిన తీవ్ర విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే, భారత సంతతికి చెందిన ఓ యువకుడికి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మద్మియా సేఠ్వాలా (28) అనే ఆ యువకుడిని దేశం విడిచి వెళ్లాలంటూ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన జీవితం అగమ్యగోచరంగా మారింది.
వివరాల్లోకి వెళితే, 2025 జూన్ 12న అహమ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిరిండియా ఫ్లైట్ 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో సేఠ్వాలా భార్య సదీఖా, వారి రెండేళ్ల కుమార్తె ఫాతిమా సహా మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లోని వడోదరకు చెందిన సేఠ్వాలా... తన భార్య డిపెండెంట్ వీసాపై 2022లో యూకే వచ్చారు. ప్రమాదం తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైన ఆయన, లండన్లోని బంధువుల సాయంతో జీవితాన్ని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఆయన డిపెండెంట్ వీసా గడువు 2026 ప్రారంభంలో ముగిసింది. తన విషాదకర పరిస్థితిని వివరిస్తూ, మానవతా దృక్పథంతో యూకేలోనే ఉండేందుకు అనుమతించాలని ఆయన చేసుకున్న అభ్యర్థనను ఏప్రిల్ 9న హోం ఆఫీస్ తిరస్కరించింది. ఏప్రిల్ 22లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
"నాకు ఇక ఏమీ మిగలలేదు. ఇండియాకు తిరిగి వెళితే ఆ బాధాకరమైన జ్ఞాపకాల నుంచి బయటపడలేను. ఇక్కడే నా జీవితాన్ని మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నాను" అని సేఠ్వాలా కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆయన న్యాయవాదులు హోం ఆఫీస్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై వలసదారుల హక్కుల సంఘాలు స్పందిస్తూ, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరుతున్నాయి. అయితే, అన్ని దరఖాస్తులను నిబంధనల ప్రకారమే పరిశీలిస్తామని హోం ఆఫీస్ వర్గాలు స్పష్టం చేశాయి.