నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ

I will not surrender to anyone says Vijay
  • తమిళనాడులో నేటి సాయంత్రం ముగుస్తున్న ఎన్నికల ప్రచారం
  • తనను అడ్డుకోవాలని ఎన్నో శక్తులు చూశాయన్న విజయ్
  • బెదిరించే శక్తులకు తాను భయపడబోనని వెల్లడి
  • టీవీకే అనేది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని వ్యాఖ్య
  • అందరూ కుటుంబ సమేతంగా వచ్చి విజిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపు

తమిళనాడు రాజకీయ రణరంగంలో ఇప్పుడు అసలైన వేడి మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేడు సాయంత్రంతో ప్రచారం ముగుస్తోంది. ఈ తరుణంలో, టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు.


ఫాసిస్టు మనస్తత్వం ఉన్న పార్టీలు లేదా అధికారంతో బెదిరించే శక్తులకు తాను భయపడనని, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న డీఎంకే, విధానపరమైన వైరుధ్యాలున్న బీజేపీ వంటి పార్టీలు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. 


తన పార్టీ కేవలం రాజకీయ విభాగం కాదని, అది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని, ప్రజల గుండెల్లో వెలిగే నిజాయతీ గల నిప్పుకణిక అని అభివర్ణించారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వచ్చి 'విజిల్' గుర్తుకు ఓటు వేయాలని, మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

Go Back to Shorts
TVK Vijay
Tamil Nadu Elections

More Telugu News