జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు... సత్తా చాటిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు

JEE Main Session 2 results out now Telugu students shines
  • జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 ఫలితాలు విడుదల
  • దేశవ్యాప్తంగా 26 మందికి 100 పర్సంటైల్
  • వంద పర్సంటైల్ సాధించిన వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు
  • టాప్ 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత
  • మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 తుది విడత ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) సోమవారం సాయంత్రం ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 26 మందిలో 10 మంది తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం.

ఎన్‌టీఏ సోమవారం మధ్యాహ్నం ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, సాయంత్రానికి ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలతో jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

100 పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు

జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి (ఏపీ)
మంతా శివ కామేశ్ (తెలంగాణ)
నరేంద్ర బాబు గారి మహిత్ (ఏపీ)
తుంగ దుర్గ సుప్రభాత్ (ఏపీ)
డి. భవితేష్ రెడ్డి (తెలంగాణ)
పసల మోహిత్ (ఏపీ)
సాయి రిత్విక్ రెడ్డి (తెలంగాణ)
వివాన్ శరద్ మహిష్వరి (తెలంగాణ)
బిజ్జం వెంకట చంద్ర శేఖర్ రెడ్డి (ఏపీ)
రిషి ప్రేమ్‌నాథ్ (తెలంగాణ)

జేఈఈ మెయిన్ రెండు సెషన్లలో కలిపి ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. ఈ పరీక్ష మే 17న జరగనుంది. అడ్వాన్స్‌డ్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి మే 4 వరకు కొనసాగుతుంది. ఈ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి దేశంలోని ప్రఖ్యాత ఐఐటీలలో ప్రవేశాలు లభిస్తాయి.
Go Back to Shorts
JEE Main Session-2
Results
Andhra Pradesh
Telangana
NTA
India

More Telugu News