Rashmika Mandanna: మరోసారి అంతర్జాతీయ వేదికపై రష్మిక.. చరిత్ర సృష్టించిన నేషనల్ క్రష్

Rashmika Mandanna at Crunchyroll Anime Awards Creates History Again
షార్ట్స్‌లో చూడండి
‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న తన క్రేజ్‌ను మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే అవార్డ్స్’లో ప్రజెంటర్‌గా వ్యవహరించేందుకు ఆమె ఎంపికయ్యారు. మే 23న జపాన్‌లోని గ్రాండ్ ప్రిన్స్ హోటల్ షిన్ టకనవాలో ఈ 10వ వార్షికోత్సవ వేడుక అట్టహాసంగా జరగనుంది. రష్మిక ఈ వేదికపై ప్రజెంటర్‌గా కనిపించడం ఇది రెండోసారి కావడం విశేషం.

ఈ విషయాన్ని రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "మళ్లీ జపాన్‌కు.. యానిమే వెనుక ఉన్న అద్భుతమైన వ్యక్తులను సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నా" అంటూ క్యాప్షన్ జోడించారు. 2024లో జరిగిన వేడుకలో తొలిసారి ప్రజెంటర్‌గా పాల్గొని, ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ సెలబ్రిటీగా రష్మిక చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రెండోసారి కూడా అదే అవకాశం దక్కించుకోవడం ద్వారా గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఆమెకున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది. ఈసారి వేదికపై ఆమెతో పాటు అసుకా సైతో, డానా పవోలా, విన్‌స్టన్ డ్యూక్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు కూడా ప్రజెంటర్లుగా వ్యవహరించనున్నారు.

రష్మికకు యానిమేషన్ ప్రపంచంతో మంచి అనుబంధం ఉంది. 'జుజుట్సు కైసెన్', 'డీమన్ స్లేయర్' వంటివి తన ఫేవరెట్ అని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో క్రంచీరోల్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే, రష్మిక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి ఆమె నటించిన 'కాక్‌టెయిల్ 2' జూన్ 19న విడుదల కానుంది. చాలా కాలం తర్వాత భ‌ర్త‌ విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే పీరియడ్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు గిరిజన నేపథ్యంతో వస్తున్న 'మైసా' అనే యాక్షన్ డ్రామా వంటి భారీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇలా ఒకవైపు ప్రాంతీయ సినిమాల్లో అగ్రతారగా కొనసాగుతూనే, మరోవైపు గ్లోబల్ పాప్ కల్చర్‌లో తనదైన ముద్ర వేస్తూ రష్మిక ముందుకు సాగుతున్నారు.

Go Back to Shorts
Rashmika Mandanna
Crunchyroll Anime Awards
Japanese Animation
National Crush
Global Entertainment
Indian Celebrity
Ranabali Movie
Cocktail 2 Movie
Maisa Movie
Vijay Deverakonda

More Telugu News