సిలిగురి కారిడార్‌లో కొత్త కేంద్ర పాలిత ప్రాంతం ప్రచారంపై స్పందించిన కేంద్రం

Siliguri Corridor New Union Territory Claim Denied by Central Government
  • బీహార్, బెంగాల్‌లోని కొన్ని జిల్లాలతో కలిపి కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు అంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టీకరణ
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కారిడార్ సమీపంలో కొత్తగా ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, అవన్నీ తప్పుడు ప్రచారాలేనని తెలిపింది. కొత్త కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని స్పష్టం చేసింది.

బీహార్ లోని పూర్ణియా, కిషన్ గంజ్, అరారియా, కటిహార్, పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలను కలిపి సిలిగురి సమీపంలో కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోందని, తద్వారా ఈ వ్యూహాత్మక ప్రాంతంలో భద్రత మరింత బలోపేతమవుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ కథనం చక్కర్లు కొట్టింది.

అయితే ఈ దీనిపై నిరాధార ప్రచారం సాగుతోందని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ఇలాంటి వాటిని షేర్ చేసినప్పుడు అధికార వర్గాల నుంచి ధృవీకరించుకోవాలని సూచించింది. 
Go Back to Shorts
Siliguri Corridor
West Bengal
Union Territory
PIB Fact Check
Fake News
Bihar
North East India

More Telugu News