Chandrababu Naidu: కొత్తగా ఆలోచించే వారి కోసం 'క్రియేటివ్ సిటీ': సీఎం చంద్రబాబు ప్రకటన
- ఢిల్లీలో రైసినా డైలాగ్-2026 సదస్సు
- ఈ సదస్సుకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఘనత
- త్వరలో అమరావతి వేదికగా గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ఏర్పాటు
- సాంకేతికతతో భారత్‌కు రివర్స్ మైగ్రేషన్ తప్పదని సీఎం వెల్లడి
- దక్షిణాదిలో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
"విభిన్నంగా ఆలోచించే వారి కోసం, సృజనాత్మకతకు పెద్దపీట వేసే మేధావుల కోసం అమరావతిలో అత్యాధునికమైన 'క్రియేటివ్ సిటీ'ని నిర్మిస్తున్నాం. కేవలం పరిపాలనా నగరంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక 'రైసినా డైలాగ్-2026' సదస్సులో పాల్గొన్న ఆయన, తన ప్రసంగంలో అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక విషయాలను ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. అమరావతిలో కేవలం భవనాలు మాత్రమే ఉండవని, అక్కడ డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలు కొలువుదీరుతాయని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో 'గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్'ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో 'సాంకేతికత - సుపరిపాలన - భవిష్యత్తు' అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. 2016 నుంచి జరుగుతున్న ఈ సదస్సుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న చంద్రబాబు, ఏపీని 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ డెస్టినేషన్'గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏఐ డేటా సెంటర్లతో పాటు, ఆరోగ్య రంగంలో డ్రోన్ అంబులెన్సులు వంటి విప్లవాత్మక మార్పులు ఏపీలో ఇప్పటికే రియాలిటీలోకి వచ్చాయని గుర్తుచేశారు. పెట్టుబడుల కోసం వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు ఇస్తూ, ఏపీని వ్యాపార అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దామని వివరించారు.
అవకాశాల గనిగా భారత్
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు కీలక స్థానాల్లో ఉన్నారని, అనేక దేశాల అభివృద్ధిలో మనవారి పాత్ర మరువలేనిదని సీఎం కొనియాడారు. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలను వేగంగా అందిపుచ్చుకోవడం వల్లే భారత్ అగ్రగామిగా ఎదుగుతోందన్నారు. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ వంటి ప్రాంతాలకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందని అభిప్రాయపడ్డారు. నైపుణ్యం, వనరులు ఉన్నచోటికే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని, త్వరలోనే భారత్‌కు 'రివర్స్ మైగ్రేషన్' మొదలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 60 శాతం భారత్‌లోనే ఉండటం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతోందని, భవిష్యత్తులో ఇతర దేశాలకు విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
జనాభా నిర్వహణపై డేంజర్ బెల్స్
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వృద్ధుల జనాభా పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ఏపీలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేసిన తాను, నేడు 'పాపులేషన్ మేనేజ్‌మెంట్' (జనాభా నిర్వహణ) ఆవశ్యకత గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేటు 1.5కి పడిపోయిందని, దీనిని కనీసం 2.1కి తీసుకురావడమే లక్ష్యంగా కొత్త పాలసీని తీసుకొచ్చామని చెప్పారు.
పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలంతా జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్థిక సాయంతో పాటు, నెలకు రూ.1000 అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ వంటి సౌకర్యాలపై కూడా ఆలోచన చేస్తున్నామన్నారు. గతంలో దేశానికి ఆస్తిగా ఉన్న పెద్ద కుటుంబాలు ఇప్పుడు మైక్రో ఫ్యామిలీలుగా మారిపోయాయని, ఈ విషయంలో ప్రజల ఆలోచనా దృక్పథాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ సహా 110 దేశాల నుంచి వచ్చిన 2700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, వ్యూహకర్తలు హాజరైన ఈ సదస్సులో చంద్రబాబు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రంతోనూ, పొరుగు రాష్ట్రాలతోనూ సమన్వయం చేసుకుంటూ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం వివరించారు.