Revanth Reddy: అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయను: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy says No Politics in Development
  • అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలకు తావులేదన్న ముఖ్యమంత్రి
  • మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ
  • మూసీ చుట్టూ వ్యాపారాలు, నైట్ టూరిజం అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి
అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయనని, అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలకు తావులేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్‌గూడ ఎకో పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ చుట్టూ వ్యాపారాలు, నైట్ టూరిజం అభివృద్ధి చేస్తామని అన్నారు.

తాను ముఖ్యమంత్రి అయ్యాక రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే సన్న బియ్యం ఇచ్చామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫామ్ హౌస్‌లో పడుకునే వారికి పేదవారి కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అందర్నీ కలుపుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తానని ముఖ్యమంత్రి అన్నారు.
Revanth Reddy
Telangana
Telangana CM
Kotwalguda Eco Park
Musi River
Rangareddy district

More Telugu News