Ambati Rambabu: అరెస్ట్ చేసుకోండి... ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు

Ambati Rambabu Says Arrest Me I Dont Care
  • దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి అంబటి సవాల్
  • ఇది జంగిల్ రాజ్ అంటూ మండిపడ్డ గుడివాడ అమర్నాథ్
  • కర్మ తిరిగొస్తే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని టీడీపీకి వైసీపీ హెచ్చరిక
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే, జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. "మీ రెడ్‌బుక్‌కు నేను భయపడను.. ఐ డోంట్ కేర్ చంద్రబాబు" అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని, ఇది మరోసారి రుజువైందని అన్నారు. "మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, ఇల్లు ధ్వంసం చేశారు. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. మా ప్రభుత్వం రాగానే, కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచిచూపిస్తాం" అని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. 
Ambati Rambabu
Andhra Pradesh Politics
YSRCP
Gudivada Amarnath
Chandrababu Naidu
TDP
Arrest Challenge
Political Clash
Jungle Raj
Attack on Ambati Rambabu

More Telugu News