Douglas Macgregor: భారత్ పై ట్రంప్ 50 శాతం సుంకాలు... అమెరికా రిటైర్డ్ అధికారి కీలక వ్యాఖ్యలు

Douglas Macgregor comments on US India relations and tariffs
  • సొంత ప్రయోజనాలకు రాజీపడి ఏ దేశం కూడా ఇతర దేశాలతో చర్చలు జరపబోదని వ్యాఖ్య
  • 50 శాతం సుంకాలు విధించడం ట్రంప్ మూర్ఖత్వపు మనస్తత్వానికి నిదర్శనమని ఆగ్రహం
  • భారత్, రష్యా దశాబ్దాలుగా మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయని వ్యాఖ్య
భారతదేశం తన సొంత ప్రయోజనాలను కాదని, అమెరికా చెప్పే ప్రతిదానికి తలాడించదని యూఎస్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్, రక్షణ రంగ నిపుణుడు డగ్లస్ మాక్‌గ్రెగర్ అన్నారు. సొంత ప్రయోజనాలకు రాజీపడి ఏ దేశం కూడా ఇతర దేశాలతో చర్చలు జరపబోదని అన్నారు. రష్యాతో వ్యాపారం చేస్తోందన్న కారణంతో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు 50 శాతం సుంకాలు విధించడం ట్రంప్ మూర్ఖ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

కొంతకాలంగా అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలపై డగ్లస్ స్పందిస్తూ, అమెరికా ఎప్పుడూ కూడా ప్రపంచ దేశాలు తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటుందని, లేదంటే వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తుందని అన్నారు. అమెరికా చెప్పే ప్రతి అంశంతో లేదా అమెరికా చేసే ప్రతి దానితో భారత్ ఎప్పుడూ ఏకీభవించాలని చూడవద్దని అన్నారు.

దశాబ్దాలుగా భారత్, రష్యా మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయని, ఇప్పుడు వాటిని కలిసి వ్యాపారం చేయవద్దంటే అవి అమెరికాను వ్యతిరేకించే అవకాశం ఉందని అన్నారు. "మీరు రష్యాతో వ్యాపారం చేస్తే కనుక మేం మీకు వ్యతిరేకం" అనేది మూర్ఖత్వమని అన్నారు. మలేసియా వంటి దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం తమ ముఖ్య విధానాల విషయంలో కూడా రాజీపడాల్సి వచ్చిందని అన్నారు. ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతూ ఇష్టారీతిన సుంకాలు విధిస్తే అది అమెరికాకే నష్టమని అన్నారు.
Douglas Macgregor
India USA relations
India Russia trade
US trade policy
Tariffs on India
India foreign policy

More Telugu News