DK Shivakumar: బీజేపీ పోస్టులపై డీకే శివకుమార్ ఫైర్

DK Shivakumar Fires on BJP Posts Regarding Scam Lord
  • భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయన్న డీకే
  • బీజేపీ సోషల్ మీడియా పోస్టులపై మండిపాటు
  • బీజేపీ పోస్టులు ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ మండిపాటు
ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వాగతించాల్సిందే అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. అయితే, రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. స్కామ్ లార్డ్ పేరుతో బీజేపీ సోషల్ మీడియా పెట్టిన పోస్టులపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇప్పటికే బీజేపీ పోస్టులపై బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు కర్ణాటక కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. బీజేపీ చేసిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవని పేర్కొంది. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ప్రతిష్ఠను దెబ్బతీసే క్రమంలోనే ఇలాంటి పోస్టులు పెట్టారని ఆరోపించింది. బీజేపీ పెట్టిన పోస్టులు వ్యక్తిత్వ హత్యకు సమానమని అన్నారు. సమాజంలో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పోస్టులు పెడుతున్నారని విమర్శించింది. 


DK Shivakumar
Karnataka
BJP
Congress
Scam Lord
Social Media Posts
Cyber Crime Police
Political Allegations
Defamation
Criticism

More Telugu News