Chiranjeevi: చిరంజీవికి నచ్చిన హీరో ఎవరో వెల్లడించిన దర్శకుడు బాబీ

Director Bobby Reveals Chiranjeevis Favorite Hero
  • నవీన్ పొలిశెట్టి  తనకు నచ్చిన హీరో అని చిరంజీవి చెప్పారన్న బాబీ
  • ఆ మాట విని ఎంతో ఆనందానికి గురైన నవీన్
  • నవీన్ మంచి టైమింగ్ ఉన్న నటుడు అంటూ బాబీ కితాబు
కోట్లాది మంది ఆరాధించే సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి స్టార్ హీరోకి కూడా టాలీవుడ్ యువ హీరోల్లో ఒక అభిమాన హీరో ఉన్నాడు. ఆయన మరెవరో కాదు... నవీన్ పొలిశెట్టి. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ కొల్లి వెల్లడించారు. తన కొత్త సినిమా చర్చల కోసం చిరంజీవిని కలిసిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను బాబీ ఒక వేదికపై వెల్లడించారు. 

తనతో చిరంజీవి మాట్లాడుతూ... నవీన్ పొలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా బాగుందటగా అని అడిగారని బాబీ తెలిపారు. ఈ తరం నటుల్లో తనకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి అని చిరంజీవి చెప్పారని వెల్లడించారు. ఈ మాటలు చెప్పగానే ఆడిటోరియంలో ఉత్సాహం వెల్లివిరిసింది. అక్కడే ఉన్న నవీన్ ఈ మాట విని ఎంతో ఆనందానికి గురయ్యాడు. ఈ సినిమా కోసం నవీన్ ఎంతో కష్టపడ్డాడని బాబీ ప్రశంసించారు. ఆ కష్టం ఫలితమే ఈరోజు ఆయనకు వచ్చిన సక్సెస్ అని చెప్పారు. నవీన్ మంచి టైమింగ్ ఉన్న నటుడు అని కితాబునిచ్చారు.
Chiranjeevi
Naveen Polishetty
Director Bobby
Anaganaga Oka Raju
Tollywood
Telugu Cinema
Bobby Kolli
Mega Star
Telugu Movies
Film News

More Telugu News