Eesha Rebba: ఆ పాత్ర విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశాడు: ఈషా రెబ్బా
- 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో క్యారెక్టర్ రోల్ చేసిన ఈష
- తనది ప్రధానమైన పాత్ర అని త్రివిక్రమ్ చెప్పారని వెల్లడి
- సినిమా విడుదలైన తర్వాత చూస్తే పరిస్థితి భిన్నంగా ఉందని ఆవేదన
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై హీరోయిన్ ఈషా రెబ్బ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ తనను మోసం చేశాడని ఆమె అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'అరవింద సమేత..' సినిమా గురించి మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రంలో ఈషా క్యారెక్టర్ రోల్ లో నటించింది. ఆ సమయంలో తనకు ఎన్నో సందేహాలు ఉన్నాయని... ఒక కమర్షియల్ సినమాలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తే భవిష్యత్తులో కూడా తనకు అలాంటి పాత్రలే వస్తాయేమోనని భయపడ్డానని చెప్పారు.
అయితే తనది ప్రధానమైన పాత్ర అని త్రివిక్రమ్ చెబితే ఓకే చెప్పానని అన్నారు. పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్ కావడంతో నో చెప్పలేకపోయానని తెలిపారు. అయితే, సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని... సినిమాలో నీ పాత్ర ఏముందని తనకు చాలా మంది ఫోన్ చేశారని చెప్పారు. మంచి పాత్ర అని చెప్పి, ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఇచ్చి తనను త్రివిక్రమ్ మోసం చేశాడని అన్నారు. మంచి సినిమాలో అవకాశం వచ్చినందుకు సంతోషించాలో, ప్రాధాన్యత లేని పాత్ర చేసినందుకు బాధపడాలో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.