Chandrababu Naidu: ఏపీలో 2 లేన్ల జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చండి: సీఎం చంద్రబాబు ఆదేశం

Chandrababu Orders Conversion of 2 Lane National Highways to 4 Lane in AP
  • ఏపీలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • రోడ్ నెట్‌వర్క్ విస్తరణ, రోడ్ డెన్సిటీ పెంపుపై కీలక చర్చ
  • ప్రాజెక్టుల అమలులో ఏపీ బెంచ్‌మార్క్‌గా ఉండాలని దిశానిర్దేశం
  • 2-లేన్ల రహదారులను 4-లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన
రాష్ట్రంలో రోడ్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు తక్షణమే ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి, రోడ్ డెన్సిటీ పెంపుదల వంటి కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్‌హెచ్ ప్రాజెక్టుల పురోగతిని, కొత్తగా చేపట్టాల్సిన రహదారుల నిర్మాణం గురించి అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక బెంచ్‌మార్క్‌గా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పనుల్లో నాణ్యత, వేగం పాటించాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ (NHAI)కు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
National Highways
Road Development
NHAI
Roads and Buildings Department
BC Janardhan Reddy
Krishna Babu
Amaravati
Highway Expansion

More Telugu News