KCR: కేసీఆర్ కు సిట్ నోటీసులు.. కేసు విచారణ సీరియస్ గా జరగడం లేదన్న కవిత

KCR Receives SIT Notice Kavitha Alleges Non Serious Investigation
  • రేపు కేసీఆర్ ను విచారించనున్న సిట్ అధికారులు
  • ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్న కవిత
  • కేసును త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రేపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. 

సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ... కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. సిట్ విచారణ నాన్-సీరియస్ గా జరుగుతోందని, ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని... అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగానే చాలా బాధాకరమని... కానీ, దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా? లేదా? అనేది వేచిచూడాలని అన్నారు.
KCR
KCR SIT Notice
BRS Party
Kavitha
Telangana Politics
Phone Tapping Case
Telangana Elections
Municipal Elections

More Telugu News