KTR: మున్సిపల్ ఎన్నికలు: కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

Telangana Municipal Elections KTRs Car Searched in Sircilla
  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎలెక్షన్ కోడ్
  • సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ వాహనం తనిఖీ
  • ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉంటామన్న కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా పట్టణంలోని మానేరు వంతెన చెక్ పోస్టు వద్ద వాహనంలో సోదా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉంటామని తెలిపారు. ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. 

ఇప్పటికే 18 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ తుల ఉమా ప్రకటించారు. మిగిలిన 21 వార్డుల అభ్యర్థులను కేటీఆర్ ప్రకటించనున్నట్లు సమాచారం.
KTR
K Taraka Rama Rao
Telangana elections
BRS party
Sircilla
Municipal elections
Thula Uma
Maneru bridge
Election code

More Telugu News