Gold Price: పసిడి, వెండి ధరలకు రెక్కలు.. ఆల్ టైమ్ రికార్డ్

Gold and Silver Prices Hit All Time Record High
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో రికార్డు స్థాయికి పసిడి, వెండి
  • భారీగా పెరిగిన బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు
  • డాలర్ బలహీనపడటం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ప్రధాన కారణం
  • వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్
  • మరింత పెరిగే అవకాశం ఉందంటున్న విశ్లేషకులు
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గుచూపారు. దీంతో పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకాయి.

భారత మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈరోజు ఉదయం 10.45 గంటల సమయంలో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 5.99 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,75,885కి చేరింది. అదేవిధంగా మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 4.24 శాతం వృద్ధితో కిలోకు రూ. 4,01,699 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపించింది.

యూఎస్ డాలర్ బలహీనపడటం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం కూడా ఈ ర్యాలీకి కారణమైంది. అంతకుముందు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడం కూడా బులియన్ మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతోపాటు అమెరికా-మిత్రదేశాల మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు కూడా పసిడికి డిమాండ్ పెంచాయి.
Gold Price
Silver price
MCX
Gold futures
Silver futures
US dollar
Iran
Commodity market
Investment

More Telugu News