Jyothi Yarraji: ఏపీ సర్కార్ కు అథ్లెట్ జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు
- 2025లో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్ జ్యోతి
- అభినందనలు తెలిపి ఆర్ధిక సహాయం చేసిన మంత్రి నారా లోకేశ్
- తాజాగా గ్రూపు -1 ఉద్యోగం, విశాఖలో ఇంటి స్థలం కేటాయించిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వానికి అథ్లెట్ జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రూప్ -1 ఉద్యోగంతో పాటు విశాఖలో తనకు 500 గజాల ఇంటి స్థలం కేటాయించడంపై అథ్లెట్ జ్యోతి కూటమి సర్కార్ కు కృతజ్ఞతలు తెలిపారు. 2025లో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి నారా లోకేశ్ ఆమెకు అభినందనలు తెలియజేస్తూ ఆర్ధిక సహాయం చేశారు.
తాజాగా గ్రూప్ - 1 ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, శాప్ చైర్మన్ రవినాయుడుకు జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు.