Chiranjeevi: కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

 Chiranjeevi Comments on Casting Couch in Telugu Film Industry
  • రూ. 300 కోట్ల మార్క్‌ను దాటుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా
  • సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించిన చిత్ర యూనిట్
  • ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి

సంక్రాంతికి థియేటర్లలో దూసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్-కామెడీ చిత్రం విడుదలైన 10-14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 247 కోట్లకు పైగా వసూళ్లు చేసి, ఇప్పుడు రూ. 300 కోట్ల మార్క్‌ను దాటుతోంది. 


ఈ ఘన విజయం నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో చిరంజీవి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదు. మగ పిల్లలైనా, ఆడ పిల్లలైనా చిత్ర పరిశ్రమలోకి వస్తే ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీ అద్దం లాంటిది... మనం ఎలా బిహేవ్ చేస్తే, రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఎవరి వర్కింగ్ స్టైల్ వారిది. బాగాలేదు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అంటే అది వారి తప్పిదమే" అని అన్నారు.


ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా గురించి స్పందిస్తూ... "అన్నం, అమ్మ, సినిమా సక్సెస్ ఎప్పుడూ బోర్ కొట్టవు. ఈ సినిమా సక్సెస్ తర్వాత కొందరు చెప్పిన మాటలు నన్ను ఎమోషనల్ చేశాయి. ఈ వయసులో ఎందుకు ఇంకా కష్టపడతారు అని అడిగారు. కానీ నాకు కష్టపడటంలోనే ఆనందం ఉంది. అభిమానుల ప్రశంసలు, శ్రేయోభిలాషుల ఉత్సాహమే దానికి కారణం" అని చెప్పారు.


ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావడం సంతోషంగా ఉందని, చాలా కాలం తర్వాత వింటేజ్ చిరంజీవితో పాటు ఆ వింటేజ్ షీల్డ్‌లు మళ్లీ చూడటం ఆనందకరంగా ఉందని తెలిపారు. అయితే, కొందరు ఔట్‌డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువ వేస్తున్నారని, కానీ ఈ సినిమాను 85 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయగలిగామని గర్వంగా చెప్పారు.

Chiranjeevi
Mana Sankara Varaprasad Garu
Anil Ravipudi
Casting Couch
Tollywood
Telugu cinema
Box office collection
Movie success
Vintage Chiranjeevi
Success celebrations

More Telugu News