Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Chandrababu Naidu and Nara Lokesh Republic Day Wishes to People
  • దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 77వ గణతంత్రదిన వేడుకలు
  • ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలన్న చంద్రబాబు 
  • గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న నారా లోకేశ్
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు సందేశం

‘సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభదినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనల్ని మనమే పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజును ఘనంగా జరుపుకుందాం. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాదులు వేసింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి’ అంటూ సీఎం చంద్రబాబు సందేశం ఇచ్చారు.

నారా లోకేశ్ సందేశం

‘77వ గణతంత్ర దినోత్సవ శుభవేళ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మువ్వన్నెల జాతీయ పతాక రెపరెపలు మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు ప్రతీక. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు 
Chandrababu Naidu
AP CM
Nara Lokesh
Republic Day
77th Republic Day
Andhra Pradesh
Amaravati
Indian Constitution
Republic Day Wishes
India Republic Day

More Telugu News