Telangana: తెలంగాణలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

Telangana Celebrates Republic Day with Governor Hoisting the Flag
  • తెలంగాణ వ్యాప్తంగా ఘ‌నంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, స్పీకర్
  • అసెంబ్లీ, మండలి, సచివాలయంలోనూ రిపబ్లిక్ డే సంబరాలు
తెలంగాణ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అధికారిక కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.

అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర సచివాలయంతో పాటు జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దేశభక్తి వాతావరణం నెలకొంది.
Telangana
77th Republic Day
Republic Day Celebrations
Parade Grounds Secunderabad
Bhatti Vikramarka
Komatireddy Venkat Reddy
Sridhar Babu
Gaddam Prasad
Gutta Sukhender Reddy
Telangana Assembly

More Telugu News