Team India: టీ20 ఫార్మాట్‌లో భారత్ జోరు.. పాకిస్థాన్ ప్రపంచ రికార్డు సమం

India Create History Equal Pakistans Huge World Record in T20I
  • న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్
  • వరుసగా 11వ సిరీస్ విజయంతో పాకిస్థాన్ రికార్డు సమం
  • తర్వాతి సిరీస్ గెలిస్తే భారత్ పేరిట సరికొత్త ప్రపంచ రికార్డు
  • స్వదేశంలో అత్యధిక సిరీస్‌ల విజయాల రికార్డు కూడా టీమిండియాదే
టీ20 ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా ఒక అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసింది.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా 11 సిరీస్‌లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును భారత్ ఇప్పుడు అందుకుంది. 2016-18 మధ్య కాలంలో సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలోని పాక్ జట్టు ఈ ఘనతను సాధించింది. ఇప్పుడు భారత్ ఆ రికార్డును సమం చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో కూడా భారతే ఉంది. 2017-18లో వరుసగా ఏడు, 2019-21 మధ్య ఆరు సిరీస్‌లు గెలిచింది.

2026లో టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో జట్టు ఈ స్థాయిలో రాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కివీస్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌ల తర్వాత సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీమిండియా ఇంగ్లండ్‌లో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్‌ను కూడా గెలిస్తే వరుసగా 12 విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది.

స్వదేశంలో అత్యధిక సిరీస్‌ల విజయాల రికార్డు
ఇప్పటికే స్వదేశంలో వరుసగా అత్యధిక టీ20 సిరీస్‌లు (10) గెలిచిన రికార్డు కూడా భారత్ పేరిటే ఉంది. గతంలో ఆస్ట్రేలియా (2006-10) ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో ఉంది.
Team India
India cricket team
T20 series
Pakistan cricket
world record
New Zealand cricket
Suryakumar Yadav
T20 World Cup 2026
cricket series wins

More Telugu News