Monda Market: మోండా మార్కెట్ గోల్డ్ షాపులో భారీ చోరీ
- రూ.25 లక్షల విలువ చేసే నగల మాయం
- తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిన దుండగులు
- సిబ్బంది పనేనని అనుమానిస్తున్న పోలీసులు
సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని ఓ గోల్డ్ షాపులో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. షాపు తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు రూ.25 లక్షల విలువ చేసే నగలను ఎత్తుకెళ్లారు. జర్గీష్ జువెలరీ షాపులో ఈ చోరీ జరిగింది. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మోండా మార్కెట్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే..
శనివారం ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన జర్గీష్ జువెలరీ షాపు యజమాని.. షటర్ తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి నిర్ఘాంతపోయారు. ఆందోళన చెందిన యజమాని లోపలికి వెళ్లి చూడగా.. కస్టమర్ ఆర్డర్ తో సిద్ధం చేసిన 16 తులాల బంగారు నగలు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. ఓ యువకుడు బ్యాగుతో వెళ్లిపోతున్న దృశ్యాలను గుర్తించారు. ఈ దొంగతనంలో షాపులో పనిచేసే సిబ్బంది హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.