KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు.. 7 గంటల పాటు కేటీఆర్ విచారణ
- కేటీఆర్ వాంగ్మూలం రికార్డు చేసిన సిట్ అధికారులు
- సుదీర్ఘంగా కొనసాగిన విచారణ
- విచారణ అనంతరం తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి రోజు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సుమారు 7 గంటల పాటు ఆయనను విచారించి వాంగ్మూలం రికార్డు చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం కేటీఆర్ జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి తెలంగాణ భవన్ చేరుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్‌ను సిట్ విచారించింది.