Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పై సంజయ్ రౌత్ విమర్శలు.. తిప్పికొట్టిన ఫడ్నవీస్ భార్య

Amruta Fadnavis Slams Sanjay Rauts Criticism of Devendra Fadnavis Davos Visit
  • పిక్నిక్ కోసం ఫడ్నవీస్ దావోస్ వెళ్లినట్లుందన్న సంజయ్ రౌత్
  • దావోస్ పర్యటనలో సీఎం ఫడ్నవీస్ రోజంతా బిజీబిజీగా గడుపుతున్నారని అమృతా ఫడ్నవీస్ వెల్లడి
  • పిక్నిక్ కి వెళ్లిన వాళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు మీటింగ్ లలో పాల్గొనరంటూ వ్యంగ్యం
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన దావోస్ కు పిక్నిక్ కి వెళ్లినట్లుందంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రౌత్ కు కౌంటర్ ఇచ్చారు.

దావోస్ లో సీఎం ఫడ్నవీస్ బిజీబిజీగా గడుపుతున్నారని, వ్యాపారవేత్తలతో నిరంతరం సమావేశాలు జరుపుతున్నారని చెప్పారు. పిక్నిక్ కు వెళ్లిన వాళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వ్యాపారవేత్తలతో సమావేశాలు జరపరని సంజయ్ రౌత్ ను ఎద్దేవా చేశారు. మహారాష్ట్రకు పెట్టుబడులు తీసుకురావడానికి, విదేశీ వ్యాపారవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించడానికి సీఎం ఫడ్నవీస్ కృషి చేస్తున్నారని, దీనికోసం దావోస్ సదస్సును సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారని అమృత చెప్పారు.

దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ వెళ్లారని, రాష్ట్రానికి పెద్దగా దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరవడం ప్రతీ ముఖ్యమంత్రి బాధ్యత అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సంజయ్ రౌత్ పై ఆమె మండిపడ్డారు. అసలు ఆయన మాట్లాడే మాటలు తనకైతే అర్థం కావని, ఎప్పుడూ నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉంటారని విమర్శించారు. సంజయ్ రౌత్ మిగతా ఆరోపణల్లాగే ‘దావోస్ సదస్సు’ పై చేసిన కామెంట్లు కూడా నిరాధారమని అమృత అభిప్రాయపడ్డారు.
Devendra Fadnavis
Amruta Fadnavis
Sanjay Raut
Davos
World Economic Forum
Maharashtra
investment
business
criticism
politics

More Telugu News