Insta uncle: 70 ఏళ్ల వయసులో తొలి వ్లాగ్.. 2 రోజుల్లోనే 2 కోట్లకు పైగా వ్యూస్

Vinod Kumar Sharma Instagarm Uncle Viral First Vlog Hits 22 Million Views
  • లేటు వయసులో ఎంట్రీ ఇచ్చి ఇన్ స్టాలో అదరగొట్టిన వృద్ధుడు
  • వ్లాగ్ చేయడం రాదని, ఇదే తన తొలి వ్లాగ్ అంటూ పరిచయ వ్యాఖ్యాలు
  • ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీ సమయాన్ని అర్థవంతంగా గడపాలని ఆశిస్తున్నట్లు వెల్లడి
పోకిరి సినిమాలో మహేశ్ బాబు చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది.. ‘ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం’.. సరిగ్గా ఈ డైలాగ్ కు సరిపోయే సంఘటన ఒకటి ఇన్ స్టాలో చోటుచేసుకుంది. డెబ్బై ఏళ్ల వయసులో ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ పెద్దాయన.. తన తొలి వ్లాగ్ తోనే యూజర్లను ఆకట్టుకున్నారు. వ్లాగ్ అప్ లోడ్ చేసిన రెండు రోజుల్లోనే ఏకంగా 2.2 కోట్ల మందికి పైగా ఆయన వీడియో చూశారు. ఇంతకీ ఈ పెద్దాయన తన తొలి వ్లాగులో ఏం చూపించారంటే.. తన గురించిన పరిచయ వ్యాక్యాలు చెప్పారంతే. తనకు వ్లాగ్ లు చేయడం రాదంటూ ఆయన చెప్పిన మాటలు యూజర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వీడియోలో ఏముందంటే..
ఇన్ స్టా అంకుల్ పేరుతో తెరిచిన ఈ పేజీలో పెద్దాయన తొలి వ్లాగ్ పోస్ట్ చేస్తూ తనను తాను పరిచయం చేసుకున్నారు. ‘నా పేరు వినోద్ కుమార్ శర్మ. నా వయసు 70 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ వాసిని. నాకు వ్లాగులు చేయడం రాదు. అయినా సరే ప్రయత్నిస్తున్నా. ఉద్యోగ విరమణ తర్వాత సమయాన్ని అర్థవంతంగా గడిపేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నా. నా ఈ తొలి వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. తద్వారా మరిన్ని వీడియోలు చేసేందుకు నాకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

ఫిదా అవుతున్న నెటిజన్లు..
శర్మ తొలి వ్లాగ్ ఇన్ స్టాలో వైరల్ గా మారింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 2.2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. శర్మ మాటలకు నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తూ.. వయసనేది కేవలం ఓ నెంబర్ మాత్రమేనని శర్మను ప్రోత్సహిస్తున్నారు. అంకుల్ జీ.. మీరు మా మనసులు సంతోషంతో నిండిపోయేలా చేశారని మరికొందరు కామెంట్ చేశారు. శర్మను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన పేజీని ఫాలో అవుతున్నారు. ఈ ఒక్క వ్లాగ్ తోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య 64 వేలకు చేరింది.
Insta uncle
first vlog
viral video
Vinod Kumar Sharma
Uttar Pradesh
retirement life
social media influencer
70 year old vlogger
indian vlogger

More Telugu News