ఆర్మీ వ్యాన్ ఢీ కొని బాలుడి దుర్మరణం.. తిరుమలగిరిలో ప్రమాదం.. వీడియో ఇదిగో!
- స్కూటీపై కొడుకును స్కూలుకు తీసుకువెళుతున్న తల్లి
- స్కూటీ స్కిడ్ అయి కిందపడ్డ తల్లీ కొడుకులు
- వెనక వచ్చిన ఆర్మీ వ్యాన్ పైకెక్కడంతో కొడుకు మృతి, తల్లికి తీవ్ర గాయాలు
తిరుమలగిరిలోని ఆర్మీ స్కూలు వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.