Begumpet: బేగంపేటలో ఫ్లైఓవర్‌పై బోల్తా పడ్డ కారు.. వీడియో ఇదిగో!

Car Overturns on Begumpet Flyover Four Injured
  • డ్రైవర్ సహా నలుగురు ప్రయాణికులకు గాయాలు
  • డివైడర్ ను ఢీ కొట్టడంతో కారు బోల్తా.. ట్రాఫిక్ జామ్
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ట్రాఫిక్ పోలీసులు
ఫ్లైఓవర్ పై వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తాపడింది. హైదరాబాద్ లోని బేగంపేట ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు స్పందించి అందులోని ప్రయాణికులను బయటకు తీశారు.

గాయాలపాలైన వారిని ట్రాఫిక్ పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో బేగంపేటలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బోల్తాపడ్డ కారును స్థానికుల సాయంతో పోలీసులు పక్కకు జరిపించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
Begumpet
Begumpet flyover
Hyderabad
car accident
road accident
flyover accident
traffic jam
car overturns
Telangana
police

More Telugu News