Khushi Mukherjee: మాట జారిన మాట వాస్తవమే.. కానీ: సూర్యకుమార్ రూ.100 కోట్ల దావాపై నటి ఖుషి క్లారిటీ

Khushi Mukherjee Clarifies on Suryakumar Yadav 100 Crore Defamation Claim
  • రూ.100 కోట్ల పరువు నష్టం దావా వార్తలపై స్పందించిన నటి ఖుషి ముఖర్జీ 
  • సూర్యకుమార్‌తో గతంలో పరిచయం ఉందని మాట జారిన మాట వాస్తవమేనని అంగీకారం
  • తనకు ఇప్పటివరకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని స్పష్టీక‌ర‌ణ‌
  • చిన్న విషయాన్ని మీడియానే ఎక్కువ చేసిందని ఆరోపణ
  • పేరు కోసం కొందరు కావాల‌ని వివాదంలోకి లాగుతున్నారని విమర్శ
టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై తాను చేసిన వ్యాఖ్యల వివాదంపై నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఖుషి ముఖర్జీ తొలిసారి స్పందించారు. సూర్యకుమార్ తనపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి అనవసరంగా పెద్ద వివాదం చేస్తున్నారని, తనకు ఇప్పటివరకు ఎలాంటి లీగల్ నోటీసు రాలేదని ఆమె స్పష్టం చేశారు.

ఈ వివాదంపై ఖుషి మాట్లాడుతూ.. "సూర్యకుమార్‌తో నాకు గతంలో పరిచయం ఉందని చెప్పాను. నా నోటి నుంచి మాట అలా జారిపోయింది. కానీ, అందులో దురుద్దేశం లేదు. మేము మాట్లాడుకునేవాళ్లం అనేది నిజం. అంతమాత్రాన అది పరువు నష్టం ఎలా అవుతుంది? నేను ఆయన పరువుకు ఎక్కడా భంగం కలిగించలేదు" అని వివరించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని పెద్ద ఆరోపణలుగా మార్చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియానే ఎక్కువగా చేసి చూపిస్తోందని ఖుషి ఆరోపించారు. "న్యూస్ ఛానెళ్లకు టాపిక్స్ లేక చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేస్తున్నాయి" అని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదంలోకి కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు కేవలం ప్రచారం కోసమే దూరారని, అలాంటి వారిని తాను పట్టించుకోనని ఘాటుగా స్పందించారు.

కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో ఖుషి మాట్లాడుతూ, సూర్యకుమార్ యాదవ్ తనకు మెసేజ్‌లు చేసేవారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఫైజాన్ అన్సారీ అనే మరో ఇన్‌ఫ్లుయెన్సర్, సూర్యకుమార్ పరువుకు నష్టం కలిగిందని చెబుతూ న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే, తాను చట్టపరంగా ఎలాంటి తప్పు చేయలేదని, ఇది అనవసరంగా సృష్టించిన వివాదమేనని ఖుషి స్పష్టం చేశారు.
Khushi Mukherjee
Suryakumar Yadav
Khushi Mukherjee interview
Suryakumar Yadav controversy
defamation case
social media influencer
Faizan Ansari
cricket
T20 captain
legal notice

More Telugu News