Harish Rao: బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్‌ను ఆలింగనం చేసుకున్న హరీశ్ రావు

Harish Rao Hugs KTR at BRS Office After SIT Questioning
  • సిట్ విచారణ అనంతరం నేరుగా బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చిన హరీశ్ రావు
  • తన కోసం వేచి చూస్తున్న కేటీఆర్ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్న హరీశ్ రావు
  • హరీశ్ రావును సుమారు ఏడు గంటల పాటు విచారించిన సిట్ బృందం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును సుమారు ఏడు గంటలు పాటు విచారించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.25 గంటల వరకు సిట్ అధికారులు హరీశ్ రావును ప్రశ్నించారు.

మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఇంటి నుంచి తెప్పించిన భోజనాన్ని అనుమతించారు. హరీశ్ రావు విచారణకు హాజరైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

సిట్ విచారణ అనంతరం హరీశ్ రావు నేరుగా బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు వేచి ఉన్నారు. కార్యాలయంలో కేటీఆర్‌ను చూడగానే హరీశ్ రావు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వారిద్దరి అనుబంధాన్ని చూసి అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Harish Rao
KTR
BRS
Telangana
Phone Tapping Case
Jubilee Hills Police Station
SIT Investigation

More Telugu News