Chandrababu Naidu: దావోస్‌లో ఐబీఎం చైర్మన్ తో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన
- క్వాంటం టెక్నాలజీలో ఏపీకి అగ్రస్థానం కల్పించాలని విజ్ఞప్తి
- 10 లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని కోరిన లోకేశ్
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన ఐబీఎం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థ ఐబీఎం (IBM) చైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్, ప్రత్యేకించి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఐబీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు పూర్తి సహకారం అందించాలని వారు ఐబీఎంను కోరారు. ఈ భేటీ ఫలప్రదంగా జరిగిందని, రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఇదే భేటీలో యువతకు కృత్రిమ మేధ (AI)లో శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువతకు ఏఐలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం సిద్ధంగా ఉందని అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 లక్షల మంది యువతకు అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో భాగంగా చంద్రబాబు, లోకేశ్ బృందం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐబీఎంతో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.