హరీశ్ రావు విచారణ.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా బయలుదేరిన వెళ్లిన ఎమ్మెల్యేలు
- పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు
- పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సంజయ్‌లు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా, హరీశ్ రావుకు అనుకూలంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, హరీశ్ రావు విచారణ ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు.