దుర్గం చెరువును వారు పట్టించుకోవడం లేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- దుర్గం చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
- దుర్గం చెరువులో పెరిగిన గుర్రపుడెక్క
- బాధ్యతను హైడ్రా తీసుకుంటుందన్న రంగనాథ్
సమీప ప్రాంతాల నుంచి మురుగు నీరు చేరడం వల్లే దుర్గం చెరువులో గుర్రపుడెక్క భారీగా పెరిగిందని రంగనాథ్ అన్నారు. అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
దుర్గం చెరువులో గుర్రపుడెక్క పెరగడంతో పర్యాటకం దెబ్బతిన్నది. చెరువులో పర్యాటక బోట్లు కూడా తిరగడం లేదు. బోటింగ్ లేకపోవడంతో సందర్శనకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ దుర్గం చెరువును సందర్శించారు.