Nitin Nabin: బీజేపీ కొత్త చీఫ్ నితిన్ నబిన్‌కు జెడ్-కేటగిరీ భద్రత... ఇక సీఆర్పీఎఫ్ పహారా
- కేంద్ర హోం శాఖ ఆదేశాలతో సీఆర్పీఎఫ్ కమాండోల పహారా
- ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగా భద్రత పెంపు
- రానున్న అసెంబ్లీ ఎన్నికల పర్యటనల నేపథ్యంలో ఈ నిర్ణయం
బీజేపీ నూతన జాతీయాధ్యక్షుడిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్-కేటగిరీ భద్రతను కల్పించింది. ఆయనకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కమాండోలు నితిన్ నబిన్‌కు రక్షణ కవచంగా వ్యవహరించనున్నారు.
ఈ ఆదేశాల ప్రకారం... నితిన్ నబిన్ దేశవ్యాప్తంగా పర్యటించేటప్పుడు, బహిరంగ సభల్లో పాల్గొనే సమయంలో, అలాగే ఆయన నివాసం వద్ద సీఆర్పీఎఫ్ దళాలు 24 గంటలూ పహారా కాస్తాయి. సాధారణంగా కీలక రాజకీయ నేతలు, కేంద్ర మంత్రులకు ఇలాంటి ఉన్నతస్థాయి భద్రత కల్పిస్తారు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన జేపీ నడ్డాకు కూడా ఇదే తరహా భద్రతను కొనసాగించారు.
నిజానికి, నితిన్ నబిన్ 2025 డిసెంబర్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పటి నుంచే భద్రతా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో భద్రతను జెడ్-కేటగిరీకి పెంచారు.
46 ఏళ్ల నితిన్ నబిన్, బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. బీహార్‌లోని బంకీపుర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా అనుభవం ఉంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆయన విస్తృతంగా పర్యటించాల్సి ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేయడం కీలకమని అధికారులు భావిస్తున్నారు.