Dimple Hayathi: రహస్య వివాహం వార్తలపై హీరోయిన్ డింపుల్ హయతి స్పందన

Dimple Hayathi responds to secret marriage news
  • డేవిడ్ అనే వ్యక్తిని డింపుల్ రహస్య వివాహం చేసుకుందని పుకార్లు
  • ఇద్దరూ కలిసే ఉంటున్నారంటూ ప్రచారం
  • తన పెళ్లి వార్తలన్నీ అవాస్తవమన్న డింపుల్

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. వినోదంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా డింపుల్ హయతి గ్లామర్‌తో పాటు నటన పరంగా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.


మరోవైపు, సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న డింపుల్ హయతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమెకు డేవిడ్ అనే వ్యక్తితో ఇప్పటికే రహస్యంగా పెళ్లి జరిగిందని, ఇద్దరూ కలిసే ఉంటున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


ఈ ప్రచారంపై తాజాగా డింపుల్ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, తనకు ఇప్పటివరకు పెళ్లే కాలేదని స్పష్టం చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఇలాంటి రూమర్స్ సృష్టించవద్దని కోరింది.

Dimple Hayathi
Dimple Hayathi marriage
David
Bharta Mahashayulaku Vijnapti
Ravi Teja
Heroine Dimple Hayathi
Tollywood
Secret marriage rumors

More Telugu News