Telangana Inter Board: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఊరట

Telangana Inter Board Allows Late Entry Up to 5 Minutes
  • ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి
  • గతేడాది నిబంధననే ఈసారీ కొనసాగించనున్న ఇంటర్ బోర్డు
  • ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వార్షిక పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. గతేడాది అమలు చేసిన ఈ నిబంధననే ఈసారి కూడా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజులు చెల్లించారు. కాగా, రేపు, ఎల్లుండి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక, ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇతర ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
Telangana Inter Board
Telangana
Inter Exams
Board Exams
Intermediate Exams
Practical Exams
Ethics and Human Values
Environmental Education
Exam Late Entry
Student Relief

More Telugu News