Indian-Origin Couple: సొంత మోటల్‌లోనే వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్.. అమెరికాలో భారత దంపతుల అరెస్ట్

Indian Origin Couple Arrested In US For Running Sex Drug Trafficking Ring At Motel
  • వర్జీనియాలోని తమ మోటల్‌నే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన వైనం
  • ఫెంటానిల్, కొకైన్ వంటి డ్రగ్స్ విక్రయంతో పాటు వ్యభిచారం నిర్వహణ
  • ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురి అరెస్ట్
  • దోషులుగా తేలితే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
అమెరికాలో భారీ సెక్స్, డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై భారత సంతతికి చెందిన దంపతులతో పాటు మరో ముగ్గురిని ఫెడరల్, స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వర్జీనియా రాష్ట్రంలో వీరు తమ సొంత మోటల్‌నే అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చి ఈ దందా నడిపినట్లు అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే... 52 ఏళ్ల కోశా శర్మ, 55 ఏళ్ల తరుణ్ శర్మ దంపతులు వర్జీనియాలో 'రెడ్ కార్పెట్ ఇన్' అనే మోటల్ నిర్వహిస్తున్నారు. వీరు తమ మోటల్‌లోని మూడో అంతస్తును పూర్తిగా డ్రగ్స్ అమ్మకాలు, వ్యభిచారం కోసం కేటాయించి, కింది అంతస్తులలో సాధారణ అతిథులకు గదులు ఇచ్చేవారు. ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చే లాభాల్లో వాటాలు తీసుకునేవారని ఫెడరల్ అధికారులు తెలిపారు. వీరితో పాటు ఈ రాకెట్‌లో భాగస్వాములైన మార్గో పియర్స్ (51), జాషువా రెడ్డిక్ (40), రషార్డ్ స్మిత్ (33) అనే మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు.

కోర్టు పత్రాల ప్రకారం 2025 మే నుంచి ఆగస్టు మధ్య ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు తొమ్మిదిసార్లు అండర్‌కవర్ ఆపరేషన్లు నిర్వహించారు. ఏజెంట్లు విటులుగా, సెక్స్ వర్కర్లుగా మోటల్‌కు వెళ్లి వీరి గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో 15 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేయగా, వాటిలో 11 సార్లు ఫెంటానిల్, నాలుగు సార్లు కొకైన్ లభించింది. కనీసం ఎనిమిది మంది మహిళలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, వారిని శారీరకంగా హింసిస్తూ బయటకు వెళ్లకుండా నిర్బంధించారని తేలింది.

అరెస్టయిన ఐదుగురిపై నియంత్రిత మాదకద్రవ్యాల పంపిణీకి కుట్ర పన్నారనే అభియోగాలు నమోదు చేశారు. నేరం రుజువైతే వారికి కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Indian-Origin Couple
Kosha Sharma
Tarun Sharma
Virginia
Red Carpet Inn
sex trafficking
drug trafficking
fentanyl
cocaine
US crime
Indian couple arrest

More Telugu News