Nitin Gadkari: పాత తరం తప్పుకుని.. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి: నితిన్ గడ్కరీ

Nitin Gadkari Calls for New Generation Leadership
  • పాత తరం తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయిందన్న గడ్కరీ
  • కొత్త తరానికి బాధ్యతలను అప్పగించాలని సూచన
  • వాహనం బాగా నడుస్తున్నప్పుడే బాధ్యతలను ఇవ్వాలని వ్యాఖ్య
పాత తరం క్రమంగా తప్పుకోవాలని, కొత్త తరం బాధ్యతలను స్వీకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగపూర్ లో జరిగిన 'అడ్వాంటేజ్ విదర్భ ఆధ్యోగిక్ మహోత్సవ్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... అడ్వాంటేజ్ విదర్భ ఇనిషియేటివ్ లో ఆశిష్ కాలే కీలక పాత్రను పోషిస్తున్నారని కొనియాడారు. ఆశిష్ తండ్రి తన స్నేహితుడని... కొత్త తరానికి అవకాశం కల్పిస్తూ తాము క్రమంగా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు. వాహనం బాగా నడుస్తున్నప్పుడే కొత్త తరానికి బాధ్యతలను అప్పగించాలని అన్నారు. బాధ్యతల నుంచి పాత తరం తప్పుకుని కొత్త పనుల్లో నిమగ్నమవ్వాలని చెప్పారు. 

విదర్భ ప్రాంతంలో ఎంతో మంది గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారని గడ్కరీ తెలిపారు. మన దేశ పారిశ్రామిక పటంలో విదర్భకు గొప్ప స్థానం కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇండస్ట్రీ, అగ్రికల్చర్, అలైడ్ సెక్టార్లు, సర్వీస్ సెక్టార్‌ ల మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Nitin Gadkari
Vidarbha
Advantage Vidarbha
Ashish Kale
Nagpur
Industrial development
New generation
Business
Industry
Agriculture

More Telugu News