Revanth Reddy: మేడారంలో ఆధునికీకరించిన గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
- కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేసిన ముఖ్యమంత్రి
- మేడారం గుడిని రూ.251 కోట్లతో అభివృద్ధి చేసిన వైనం
మేడారంలో ఆధునికీకరించిన గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తన మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
త్వరలో జరగనున్న మేడారం మహా జాతర నేపథ్యంలో ప్రభుత్వం రూ.251 కోట్లతో ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చేసిన విషయం తెలిసిందే.