Gannavaram Airport: పొగమంచు ఎఫెక్ట్ .. గన్నవరంలో గాలిలో చక్కర్లు కొట్టిన విమానం
- పొగమంచుతో గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం
- హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి రావాల్సిన విమానాలు ఆలస్యం అవుతున్న వైనం
- ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన విమానం గాలిలో చక్కర్లు కొట్టిన పరిస్థితి
విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం పొగమంచు తీవ్రంగా ఉండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ నుంచి గన్నవరం వస్తున్న ఒక విమానం ల్యాండింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
పొగమంచు ప్రభావం కారణంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి రావాల్సిన విమానాలు సైతం ఆలస్యంగా చేరుకున్నాయి. అదేవిధంగా విజయవాడ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు షెడ్యూల్ ప్రకారం కాకుండా ఆలస్యంగా బయలుదేరాయి. విమానాశ్రయ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వాతావరణం అనుకూలంగా మారగానే విమానాల ల్యాండింగ్‌కు అనుమతించారు.
ప్రయాణికులు సహకరించాలని, తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.