Bangaraiah: కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్త మృతి

TDP Activist Dies in Clash with YSRCP in Kakinada District
  • కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్తత
  • దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు
  • గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో, ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందాడు. మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దుర్గా ప్రసాద్, శ్రీరామమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ కార్యకర్తలు నారాయణమూర్తి, సతీశ్ లకు కూడా తీవ్ర గాయాలు కావడంతో... వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. 

ఘర్షణ వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్తలు ఒక పుట్టినరోజు వేడుకకు వెళ్లి వస్తుండగా వారికి వైసీపీ  కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. పాత గొడవలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 
Bangaraiah
Kakinada district
Kotananduru
Allipudi village
TDP
YSRCP
political clash
Andhra Pradesh
political violence
crime

More Telugu News