Manchu Vishnu: షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను ప్రకటించిన మంచు విష్ణు... ప్రైజ్ ఏంటో తెలుసా?

Manchu Vishnu Announces Short Film Contest
  • ఆవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ -1ను ప్రకటించిన మంచు విష్ణు
  • విజేతగా నిలిచిన దర్శకుడికి పది కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశాన్ని కల్పిస్తామన్న మంచు విష్ణు
  • అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకురావడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యమన్న విష్ణు
సంక్రాంతి సందర్భంగా హీరో మంచు విష్ణు ఒక కీలక ప్రకటన చేశారు. ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక పోటీని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ -1 పేరుతో ఈ పోటీని  నిర్వహిస్తున్నట్టు ఆవా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఈ పోటీలో పాల్గొనేవారు గరిష్ఠంగా పది నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను సమర్పించవచ్చునని ప్రకటనలో పేర్కొన్నారు. కథ చెప్పే విధానం, దర్శకత్వ ప్రతిభ ఆధారంగా విజేతను ప్రకటిస్తామని విష్ణు తెలిపారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన దర్శకుడికి పది కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశాన్ని నిర్మాత మంచు విష్ణు కల్పిస్తారు.

అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకురావడమే ఈ పోటీ యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. 
Manchu Vishnu
Ava International Short Film Contest
Telugu short films
Short film contest
Telugu cinema
Movie opportunity
Film director
Ava Entertainments

More Telugu News