KA Paul: కాన్సాస్ సెనేట్ లో కేఏ పాల్ ప్రత్యేక ప్రసంగం... ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు

KA Paul Special Speech in US Senate for World Peace
  • అమెరికాలోని ఓ స్టేట్ సెనేట్ లో కేఏ పాల్ ప్రసంగం
  • యుద్ధాలన్నీ వెంటనే ఆగిపోవాలన్న పాల్
  • భారత్, అమెరికా మధ్య బంధాలు బలోపేతం కావాలని ఆకాంక్ష
ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ వెంటనే ఆగిపోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 58 ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయని, వీటి వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, ట్రిలియన్ల డాలర్లు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్ (అసెంబ్లీ)లో ప్రసంగింస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలను శాశ్వతంగా నిర్మూలించడంతోనే శాంతి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని పాల్ అన్నారు. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని చెప్పారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో భారత్, అమెరికాలు కీలక పాత్ర పోషంచగలవని అన్నారు. 
KA Paul
KA Paul speech
America Senate
World Peace
Praja Shanti Party
India America relations
Kansas State Senate
Global wars

More Telugu News