Gade Innaiah: గాదె ఇన్నయ్య తల్లి మృతి.. చంచల్ గూడ జైల్లో ఉన్న ఇన్నయ్య
- గాదె ఇన్నయ్య తల్లి థెరిసమ్మ కన్నుమూత
- రేపు జరగనున్న అంత్యక్రియలు
- ఇటీవలే ఇన్నయ్యను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
మాజీ మావోయిస్టు, సామాజిక ఉద్యమకారుడు, 'మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ' నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తల్లి థెరిసమ్మ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. గత ఏడాది కాలంగా ఇన్నయ్య తన తల్లి వద్దే ఉంటున్నారు. అయితే, ఎన్ఐఏ కేసులో ఇటీవలే ఇన్నయ్య అరెస్ట్ అయ్యారు.
మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రజలను ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలతో ఆయనను ఉపా (యూఏపీఏ) చట్టం కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో, తన తల్లి చివరి చూపుకు ఆయనకు అవకాశం లభిస్తుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది.