Pithoragarh: భారత్ లోని గ్రామాలకు నేపాల్ టెలికాం సిగ్నల్స్... ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

Nepal Telecom Signals Reach Indian Villages in Uttarakhand
  • ఉత్తరాఖండ్ లోని ఫిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో సిగ్నల్స్ సమస్య
  • దాదాపు 78 గ్రామాలకు సమస్య
  • మొబైల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్న జిల్లా కలెక్టర్

ఉత్తరాఖండ్‌ లోని పిథౌరాగఢ్‌ జిల్లా సరిహద్దు గ్రామాల్లో మొబైల్‌ సిగ్నల్స్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. నేపాల్‌ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ గ్రామాల్లో భారతీయ టెలికాం కంపెనీల సిగ్నల్స్ బదులు నేపాల్‌ టెలికాం సిగ్నల్స్‌ వస్తున్నాయి. దీనివల్ల గ్రామీణులు వీడియో కాల్స్‌, గ్యాస్‌ బుకింగ్‌, ఆన్‌లైన్‌ విద్య వంటి సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ చౌహాన్‌ మాట్లాడుతూ... సిగ్నల్ సమస్యపై మొబైల్‌ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. 


పిథౌరాగఢ్‌ జిల్లాలో దాదాపు 78 సరిహద్దు గ్రామాలు సిగ్నల్స్ సమస్యతో ఇబ్బందిపడుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 18-20 కి.మీ. దూరంలోని ఈ గ్రామాల్లో భారతీయ టవర్లు తక్కువగా ఉండటం వల్ల నేపాల్‌ సిగ్నల్స్‌ డామినేట్‌ చేస్తున్నాయి. దీని వల్ల సెక్యూరిటీ రిస్క్‌లు పెరుగుతున్నాయి. విద్యార్థుల ఆన్‌లైన్‌ చదువులకు ఆటంకం కలుగుతోంది. గ్యాస్ బుకింగ్స్ వంటి వాటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది.

Pithoragarh
Pithoragarh district
Uttarakhand
Nepal telecom signals
India Nepal border
Border villages
Mobile signals problem
Online education
Gas booking
Ashish Chauhan

More Telugu News