బార్డర్ లో పాక్ డ్రోన్ల కలకలం.. కాల్పులు జరిపిన సైన్యం
- రాజౌరీ సమీపంలో ఎల్వోసీ వద్ద చక్కర్లు కొట్టిన పాక్ డ్రోన్లు
- 48 గంటల్లోనే రెండుసార్లు మన సరిహద్దుల్లోకి రాక..
- మంగళవారం రాత్రి ఘటన.. బార్డర్ వెంబడి తనిఖీ చేపట్టిన సోల్జర్లు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన ఈ డ్రోన్లపై కాల్పులు జరపగా.. వెంటనే వెనక్కి వెళ్లిపోయాయని వివరించారు. కాగా, ఈ డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాల రవాణా కానీ అక్రమ ఆయుధాల వ్యాపారం కానీ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రోన్ల కదలికలు గుర్తించిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సైన్యం తనిఖీలు చేపట్టింది. డ్రోన్ల ద్వారా ఏవైనా ప్యాకెట్లు జారవిడిచి ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.