Karate Kalyani: యూట్యూబర్ అన్వేష్‌పై మరోసారి కరాటే కల్యాణి ఆగ్రహం

Karate Kalyani Angered Over YouTuber Anveshs Passport Comments
  • భారత పాస్‌పోర్టు పట్ల అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కరాటే కల్యాణి
  • భారతదేశంలో పౌరసత్వం ఎంత ముఖ్యమో పాస్‌పోర్టు కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్య
  • పాస్‌పోర్టుపై రాజముద్ర ఉంటుందన్న కరాటే కల్యాణి
'నా అన్వేషణ' యూట్యూబర్ అన్వేష్‌పై ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత పాస్‌పోర్టును దరిద్రపు పాస్‌పోర్టు అని అన్వేష్ వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లే భారతీయులకు పాస్‌పోర్టు ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. పాస్‌పోర్టు గురించి పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందని, దీనికి ఎంతో విలువ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అతడి పాస్ పోర్టును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

పాస్‌పోర్టుపై రాజముద్ర ఉంటుందని, అలాంటి పాస్‌పోర్టును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటామని ఆమె అన్నారు. మనం ఎంతో జాగ్రత్తగా చూసుకునే పాస్‌పోర్టును అన్వేష్ దూషిస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగు గంటలు వెరిఫికేషన్ కోసం నిరీక్షించేలా చేశారని అన్వేష్ చెబుతున్నాడని, కానీ అతని ప్రవర్తన చూసి వెయిట్ చేయించారని ఆమె విమర్శించారు. అన్వేష్ పాస్‌పోర్టు రద్దయ్యేంత వరకు తాము పోరాడతామని ఆమె అన్నారు. అన్వేష్ భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Karate Kalyani
Anvesh
Naa Anveshana
Passport
Indian Passport
Passport Controversy
Social Media

More Telugu News